శతక్కొట్టిన రెన్‌షా
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:31 AM
మ్యాట్ రెన్‌షా (190) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 390 పరుగులకు ఆలౌటైంది....
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 390
డర్బన్: మ్యాట్ రెన్‌షా (190) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 390 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ 187/6 స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ దాదాపు 400 రన్స్ చేసిందంటే అందుకు రెన్‌షా అద్భుత పోరాటమే కారణం. కెప్టెన్ కమిన్స్‌తో ఏడో వికెట్‌కు 86 పరుగులు మ్యాట్ జోడించాడు. అనంతరం నాథన్ లయన్ (27) జతగా తొమ్మిదో వికెట్‌కు 134 పరుగులు జత చేసిన రెన్‌షా జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఈ క్రమంలో కెరీర్ అత్యుత్తమ స్కోరు చేసిన మ్యాట్..ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షి్‌పలో దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన సఫారీలు రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 27/1 స్కోరు చేశారు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!
ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్
టీమిండియాతో సిరీస్.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ