Share News

కేకేఆర్ నుంచి మొన్న హర్షిత్.. ఇప్పుడు ఆకాశ్‌ దీప్‌ ఔట్!

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:56 PM

ఐపీఎల్ 2026 సీజన్ మరోవారంలో ప్రారంభం కానుంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో షాక్ తగిలింది. గత వేలంలో తీసుకున్న ఆకాశ్‌ దీప్‌ కూడా లీగ్‌ నుంచి తప్పుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి.

కేకేఆర్ నుంచి మొన్న హర్షిత్.. ఇప్పుడు ఆకాశ్‌ దీప్‌ ఔట్!
KKR IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ మరోవారంలో ప్రారంభం కానుంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో షాక్ తగిలింది. గత వేలంలో తీసుకున్న ఆకాశ్‌ దీప్‌ కూడా లీగ్‌ నుంచి తప్పుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా రూపంలో ఓ పేసర్‌ను కేకేఆర్ జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆకాశ్ దీప్ కూడా సీజన్ ఆడటం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఆకాశ్ దీప్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో చికిత్స పొందుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అతడు కోలుకుని వచ్చి ఆడటం కష్టమేనని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2022లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఆకాశ్... ఇప్పటివరకు ఆడింది కేవలం 14 మ్యాచులే కావడం గమనార్హం. గత ఐపీఎల్‌లో ఆకాశ్‌ను కోల్‌కతా జట్టు కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. అతడికి గాయాలు కొత్తేమీ కాదు. గతంలోను పలు సందర్భాల్లో గాయాల కారణంగా మ్యాచులకు దూరమయ్యాడు.


ఆకాశ్‌ దీప్‌ గైర్హాజరుపై కేకేఆర్ ప్రధాన కోచ్ అభిషేక్ నాయర్ స్పందించలేదు. కానీ, హర్షిత్ రాణా స్థానంలో మరొకరిని చూస్తామని వెల్లడించాడు. ఈనెల 17న ప్రారంభమైన శిక్షణ శిబిరంలో కూడా ఆకాశ్ దీప్ కనిపించలేదు. దీంతో బౌలింగ్ విభాగంపై ఆ జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే కేకేఆర్.. ముస్తఫిజుర్ రెహమాన్ స్థానంలో బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకువచ్చి ఒక మార్పు చేసింది. కానీ అది మినహా, వారి పేస్ బౌలింగ్ వనరులు ఇప్పుడు బలహీనంగా కనిపిస్తున్నాయని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్

మహిళల టీ20లో చరిత్ర సృష్టించిన రువాండా క్రికెటర్

Updated Date - Mar 21 , 2026 | 06:13 PM