బుమ్రా టెస్టులకు మాత్రమే?
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:01 AM
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20, ఐదు వన్డేలతో...
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్టుల సిరీస్ కూడా ఆడబోతోంది. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ జట్టును ప్రకటించారు. దీనికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వన్డే సిరీస్‌కు కూడా అతడిని దూరంగా ఉంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుమ్రాపై పనిఒత్తిడి పడకుండా టెస్టుల కోసం తాజాగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ‘బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు. కివీస్ పర్యటన సుదీర్ఘంగా సాగనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లతో పోలి స్తే టెస్టులు ముఖ్యమైనవి. కాబట్టి బుమ్రాతో వన్డేల్లో ఆడించి ఆ తర్వాత వెంటనే రెడ్‌బాల్ క్రికెట్ వైపు దృష్టి మళ్లించడంలో అర్థంలేదు. అతడిని తాజాగా ఉంచి బరిలోకి దింపాలనుకుంటున్నాం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నవంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ