ఐపీఎల్ వేలంలో 1220 మంది
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:53 AM
గోవాలో వచ్చే నెల 16న జరిగే ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 1220 మంది ఆటగాళ్లు బరిలో నిలవనున్నారు. అన్ని జట్లలో కలిపి 66 ఖాళీలుండగా...
బరిలో ఆర్యవీర్, వార్నర్
న్యూఢిల్లీ: గోవాలో వచ్చే నెల 16న జరిగే ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 1220 మంది ఆటగాళ్లు బరిలో నిలవనున్నారు. అన్ని జట్లలో కలిపి 66 ఖాళీలుండగా.. వీటిలో 25 విదేశీ ప్లేయర్ల స్లాట్‌లు. ఇక అండర్-19 ఆసియా కప్‌లో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఆర్యతోపాటు అదే టోర్నీ ఫైనల్లో భారత్‌కు ఉత్కంఠ విజయాన్ని అందించిన మోహిత్ ఉల్వ కూడా రూ. 30 లక్షల కనీస ధరకు అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. అయితే, కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ, ద్రవిడ్ కొడుకు అన్వయ్ వేలానికి దూరంగా ఉండనున్నారు. కాగా, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, బ్యాటర్ నితీశ్ రాణా కూడా అన్‌క్యాప్డ్ కేటగిరీలో రూ. 50 లక్షల కనీస ధరకు నమోదయ్యారు. మన్‌దీప్ సింగ్, మయాంక్ మార్కండే, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా కూడా వేలానికి రానున్నారు. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (రూ. 2 కోట్లు) మళ్లీ వేలంలో ఉండనున్నాడు. వార్నర్ చివరగా 2024లో మెగా లీగ్‌లో ఆడాడు. రూ. 2 కోట్ల జాబితాలో ఉన్న ఆసీస్ పేసర్ జే రిచర్డ్‌సన్ సగం మ్యాచ్‌లకు, ఇంగ్లండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ 80 శాతం, న్యూజిలాండ్ బ్యాటర్ జాన్ జాకబ్స్ 10 శాతం షెడ్యూల్‌కే అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్