జైత్రయాత్రకు బ్రేక్
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:31 AM
ఒకటి కాదు.. రెండుకాదు.. వరుసగా పది టీ20 విజయాలతో న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు సాగిస్తున్న జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శుక్రవారం కివీస్‌తో జరిగిన నాలుగో టీ20లో శ్రేయాస్ సేన ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేకపోయింది.
87 రన్స్ తేడాతో ఓడిన భారత్
జూపేసర్ డఫీకి నాలుగు వికెట్లు
గ్లెన్ ఫిలిప్స్ శతకం
న్యూజిలాండ్‌కు తొలి విజయం
ఆక్లాండ్: ఒకటి కాదు.. రెండుకాదు.. వరుసగా పది టీ20 విజయాలతో న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు సాగిస్తున్న జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శుక్రవారం కివీస్‌తో జరిగిన నాలుగో టీ20లో శ్రేయాస్ సేన ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేకపోయింది. అటు గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) అద్భుత శతకంతో పాటు బ్రేస్‌వెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 65) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టు అదరగొట్టగా.. అనంతరం పేసర్ డఫీ (4/23) నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో 87 పరుగుల తేడాతో సిరీ్‌సలో తొలి విజయాన్ని రుచి చూసిన న్యూజిలాండ్, టీమిండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించింది. ఆఖరి మ్యాచ్ ఆదివారం హామిల్టన్‌లో జరుగుతుంది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 259/7 పరుగులు చేసింది. ఆలెన్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), మిచెల్ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) వేగంగా ఆడారు. మయాంక్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (35), నమన్ ధిర్ (28), అభిషేక్ (27) ఫర్వాలేదనిపించారు.
తొలి ఓవర్ నుంచే..: 259 పరుగుల భారీ ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శాంసన్ (4), ఇషాన్ (0)లను తొలి ఓవర్‌లోనే పేసర్ డఫీ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో అభిషేక్, శ్రేయాస్ (22) రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే వేగంగా ఆడే క్రమంలో తొలి తొమ్మిది ఓవర్లలోనే ఆరుగురు ఆటగాళ్లు వెనుదిరగారు. నితీశ్ (21), నమన్, తిలక్ ఉన్న కాసేపు షాట్లతో ఆకట్టుకున్నా రన్‌రేట్ భారీగా పెరగడంతో చేసేదేమీ లేకపోయింది. కివీస్ ఫీల్డర్లు పలు క్యాచ్‌లను జారవిడవకుంటే భారత్‌కు 150 పరుగులు కూడా కష్టమే అయ్యేది.
ఫిలిప్స్ బాదుడు: ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఆడిన కివీస్ భారీ స్కోరుతో విరుచుకుపడింది. ఇందుకు ఫిలిప్స్ మెరుపు శతకానికి బ్రేస్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్ జత కలిసింది. ఆఖరి పది ఓవర్లలో 150 పరుగులు సమకూరడం విశేషం. సైఫర్ట్ (3) తొలి ఓవర్‌లోనే వెనుదిరగ్గా, మిచెల్ (24) మూడో ఓవర్‌లో అవుటయ్యాడు. అటు ఎనిమిదో ఓవర్‌లో ఆలెన్ 18 రన్స్ అందించి వెనుదిరిగాడు. జాకబ్స్ (7) అవుటయ్యాక ఫిలిప్స్‌కు బ్రేస్‌వెల్ జత కలిశాడు. దీంతో భారత బౌలర్లకు చుక్కలు కనిపించాయి. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన ఫిలిప్స్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నితీశ్ ఓవర్‌లో ఫిలిప్స్ వరుసగా నాలుగు సిక్సర్లతో 32 పరుగులు రాబట్టాడు. మయాంక్ ఓవర్‌లోనూ 3 సిక్సర్లు బాదిన బ్రేస్‌వెల్ 19 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివరకు ప్రిన్స్ అతడిని ఎల్బీ చేయడంతో ఐదో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఓ సిక్సర్‌తో 46 బంతుల్లోనే ఫిలిప్స్ సెంచరీ పూర్తయ్యింది. చివరి ఓవర్‌లో తను వెనుదిరిగినా కివీస్ స్కోరు 250 దాటింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: సైఫర్ట్ (సి) ప్రిన్స్ (బి) మయాంక్ 3, ఆలెన్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 31, మిచెల్ (ఎల్బీ) మయాంక్ 24, ఫిలిప్స్ (సి) అభిషేక్ (బి) నితీశ్ 107, జాకబ్స్ (సి) అర్ష్‌దీప్ (బి) మయాంక్ 7, బ్రేస్‌వెల్ (ఎల్బీ) ప్రిన్స్ 65, శాంట్నర్ (సి) నితీశ్ (బి) అర్ష్‌దీప్ 5, స్మిత్ (నాటౌట్) 6, మిల్నే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 259/7. వికెట్ల పతనం: 1-5, 2-34, 3-93, 4-112, 5-227, 6-246, 7-252. బౌలింగ్: మయాంక్ యాదవ్ 4-0-48-3, అర్ష్‌దీప్ 4-0-38-1, ప్రిన్స్ యాదవ్ 4-0-49-1, నితీశ్ కుమార్ 4-0-64-1, అక్షర్ 3-0-43-1, నమన్ ధిర్ 1-0-16-0.
భారత్: శాంసన్ (సి) సైఫర్ట్ (బి) డఫీ 4, అభిషేక్ (సి) శాంట్నర్ (బి) ఫిషర్ 27, ఇషాన్ (సి అండ్ బి) డఫీ 0, శ్రేయాస్ (బి) మిల్నే 22, అక్షర్ (సి అండ్ బి) శాంట్నర్ 7, నితీశ్ (సి) బ్రేస్‌వెల్ (బి) శాంట్నర్ 21, తిలక్ (సి) సైఫర్ట్ (బి) ఫిషర్ 35, నమన్ (సి) స్మిత్ (బి) డఫీ 28, అర్ష్‌దీప్ (సి) జాకబ్స్ (బి) డఫీ 0, ప్రిన్స్ (నాటౌట్) 18, మయాంక్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 172/9. వికెట్ల పతనం: 1-4, 2-4, 3-50, 4-56, 5-86, 6-89, 7-121, 8-121, 9-158. బౌలింగ్: డఫీ 4-0-23-4, మిల్నే 4-0-35-1, స్మిత్ 4-0-47-0, ఫిషర్ 4-0-40-2, శాంట్నర్ 4-0-24-2.
టీ20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యధిక స్కోరు (259). అలాగే, ఈ ఫార్మాట్‌లో భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. పరుగుల పరంగా (87) భారత్‌కు టీ20ల్లో ఇది రెండో భారీ పరాజయం.
ఒకే ఓవర్‌లో ఎక్కువ పరుగులు (32) ఇచ్చుకున్న భారత టీ20 బౌలర్‌గా స్టువర్ట్ బిన్నీతో కలిసి రెండో స్థానంలో ఉన్న నితీశ్. దూబే (34) టాప్‌లో ఉన్నాడు.
2020 తర్వాత..
భారత జట్టుకు న్యూజిలాండ్ పర్యటనలో 2020 నుంచి ఆడిన పది మ్యాచుల్లో ఓటమనేదే లేకపోవడం విశేషం. చివరకు తాజా సిరీస్ నాలుగో టీ20లో టీమిండి యాపై ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది.
టీ20ల్లో అత్యంత వేగంగా (2143 బంతుల్లో) 150 వికెట్లు తీసిన పేసర్‌గా అర్ష్‌దీప్. అలాగే ఒకే క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ వికెట్లు (40) తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!