బ్యాటర్లదే భారం
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:02 AM
వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీ్‌స..టీ20లలో అనూహ్యంగా పుంజుకొంది. పొట్టి ఫార్మాట్లో తనదైన శైలితో రెండు మ్యాచ్‌లు నెగ్గింది. దాంతో సిరీస్ 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో నిర్ణాయక ఐదో టీ20 శనివారం ఇక్కడ జరగనుంది.
బెంగళూరు: వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీ్‌స..టీ20లలో అనూహ్యంగా పుంజుకొంది. పొట్టి ఫార్మాట్లో తనదైన శైలితో రెండు మ్యాచ్‌లు నెగ్గింది. దాంతో సిరీస్ 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో నిర్ణాయక ఐదో టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఆఖరి పోరులో టీమిండియా బ్యాటర్లు స్థాయికి మించిన ప్రదర్శన కనబరచాల్సిందే. ముఖ్యంగా శాంసన్, అభిషేక్ ఓపెనింగ్ జోడీ సమష్టిగా చెలరేగాల్సి ఉంటుంది. వీరిద్దరూ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణిస్తున్నారు కానీ ఓపెనర్లుగా ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు.
నాలుగు మ్యాచ్‌లలో వారిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం 29, 42, 7, 60 కావడం గమనార్హం. ఓపెనింగ్ జోడీ విఫలమవుతుండగా..అండగా నిలవాల్సిన ఇషాన్, కెప్టెన్ అయ్యర్, నమన్ ధిర్‌తో కూడిన మిడిలార్డర్ కూడా చేతులెత్తేస్తోంది. మొదటి టీ20లో అయ్యర్ 102 పరుగులు చేసినా.. తర్వాతి మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. నాలుగో టీ20లో 248 పరుగుల ఛేదనలో టీమిండియా బ్యాటర్లు ఒత్తిడికి లోనవడం జట్టుపై ప్రభావం చూపింది.
సుదీర్ఘకాలం తర్వాత.. న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా పేసర్ భువనేశ్వర్ జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే అర్ష్‌దీప్ గాయపడడంతో వెస్టిండీ్‌సతో ఆఖరి టీ20కి భువనేశ్వర్‌ను జట్టులో చేర్చారు. కివీస్ పర్యటనకు ముందు భువీకి అంతర్జాతీయ మ్యాచ్ ప్రాక్టీస్‌లో భాగంగా శనివారంనాటి పోరుకు అతడికి తుది జట్టులో చోటిస్తారేమో చూడాలి. పైగా..ఆర్సీబీ జట్టు బౌలర్‌గా చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై భువనేశ్వర్ సత్తా చాటే అవకాశముంది. అలాగే దూకుడు మీదున్న వెస్టిండీస్ బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు కుల్దీప్ యాదవ్‌ను ఆడించే చాన్సు లేకపోలేదు. మరోవైపు సిరీస్ సమం చేసిన ఉత్సాహంలో ఉన్న వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గాలని పట్టుదలగా ఉంది.
భారీ వర్ష సూచన
బెంగళూరులో శనివారంనాటి వాతావరణం క్రికెట్ అభిమానులను నిరాశ పరిచేలా ఉంది. బలమైన ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం కూడా స్టేడియం పరిసరాల్లో చిన్నపాటి వర్షం కురిసింది.
పిచ్/వాతావరణం
న్యూజిలాండ్‌తో 2024లో టెస్టు మ్యాచ్ తర్వాత ఈ వేదికపై మరో అంతర్జాతీయ పోటీ జరగలేదు. సాధారణంగా ఇక్కడి వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పరుగులు వెల్లువెత్తాయి. పిచ్ తయారీలో మార్పులు జరిగితే తప్ప బ్యాటర్లకు పండగే.
జట్లు (అంచనా)
భారత్: శ్రేయాస్ (కెప్టెన్), అభిషేక్, శాంసన్, ఇషాన్, తిలక్, నమన్, నితీశ్, అక్షర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీ్‌ప/భువనేశ్వర్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, హెట్మయెర్, పొవెల్, రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్, చేజ్, స్ర్పింగర్, కీమో పాల్, షమార్ జొసెఫ్, గుడకేష్ మోటీ.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్‌గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్
వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్