ప్రతీకారం తీరేనా?
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:48 AM
అంచనాలకు తగ్గట్టే అండర్-19 వన్డే ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ యువ జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి.
పాక్‌తో భారత్ ఫైనల్ నేడు
అండర్-19 ఆసియాకప్
ఉదయం 10.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
ఒమన్: అంచనాలకు తగ్గట్టే అండర్-19 వన్డే ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ యువ జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య శనివారం టైటిల్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిన భారత్ లెక్క సరిచేయాలనుకుంటోంది.
అంతేకాకుండా గతేడాది తుదిపోరులో ఎదురైన పరాభవానికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. భారత్ విజేతగా నిలిస్తే తొమ్మిదో టైటిల్ మన ఖాతాలో చేరుతుంది. మరోసారి బ్యాటింగ్ భారం ఆర్యవీర్ సెహ్వాగ్, కెప్టెన్ రాయ్‌చందానీలపై పడనుంది. అటు డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న పాక్ అజేయంగా టోర్నీని ముగించాలనుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!