Share News

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత్-ఏ జట్టు ప్రకటన..

ABN , Publish Date - Nov 02 , 2026 | 07:58 PM

త్వరలో జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీ కోసం బీసీసీఐ భారత్-ఏ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు వివరాలను ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇవాళ వెల్లడించింది

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత్-ఏ జట్టు ప్రకటన..
Rising Stars Asia Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: త్వరలో జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీ కోసం బీసీసీఐ భారత్-ఏ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు వివరాలను ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇవాళ(సోమవారం) వెల్లడించింది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ‌‌ను సారథిగా ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ.. రజత్ పాటిదార్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.


టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా ఈ జట్టులో చోటుదక్కింది. ఇటీవలే న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఈ జోడీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 43 బంతుల్లోనే 133 పరుగులతో రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అలానే రింకు సింగ్, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా వంటి పలువురు స్టార్ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది.


ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి జట్టుకు దూరమైన హర్షిత్ రాణా ఈ టోర్నమెంట్‌తో తిరిగి జట్టులోకి వస్తున్నాడు. వికెట్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రాన్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ అతడికి బ్యాకప్‌గా జార్ఖండ్ స్టార్ ప్లేయర్ కుమార్ కుశాగ్రకు అవకాశం కల్పించింది. అలానే యువ పేస్ ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్, షెహ్‌బాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుశ్ కోటియన్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా చోటు దక్కించుకున్నారు.


వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ఈ సారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. నవంబర్ 19 నుంచి 29 వరకు దోహా వేదికగా ఈ టోర్నీ జరగనుండగా.. పాకిస్థాన్, యూఏఈ, నేపాల్‌తో భారత్ గ్రూప్-ఏలో ఉంది. టీమిండియా నవంబర్ 20న నేపాల్‌తో, నవంబర్ 22న పాకిస్థాన్‌తో నవంబర్ 24న యూఏఈతో తలపడనుంది. మరోవైపు, గ్రూప్-బిలో బంగ్లాదేశ్-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ, శ్రీలంక-ఎ వంటి జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్, నవంబర్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి భారత్-ఏ జట్టు:

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), తిలక్ వర్మ(కెప్టెన్), రజత్ పాటిదార్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, కుమార్ కుశాగ్ర( వికెట్ కీపర్), సూర్యాన్ష్ షెడ్గే, షెహ్‌బాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనూశ్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.


ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!

ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..

అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..

Updated Date - Nov 02 , 2026 | 08:36 PM