ముంబై కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Nov 02 , 2026 | 07:01 PM
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కాబోయే కెప్టెన్‌గా తెలుగు తేజం తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో 2027 ఐపీఎల్ నాటికి తిలక్‌కు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు కాబోయే కెప్టెన్‌గా తెలుగు తేజం తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో 2027 ఐపీఎల్ నాటికి తిలక్‌కు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతడికి, ముంబై ఫ్రాంచైజీకి కూడా నాయకత్వం వహించే అర్హత సాధించాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ అభిప్రాయాలతో భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విభేదిస్తున్నారు. ఐపీఎల్‌లో తిలక్ వర్మ ప్రదర్శన పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన శ్రీకాంత్.. తిలక్ వర్మ ప్రదర్శన నిలకడగా లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'తిలక్ వర్మ టీమిండియాకు వైస్ కెప్టెన్ కావచ్చు, కానీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అతడి ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. గత ఏడాది ఒక సెంచరీ మినహా మిగతా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గత రెండు మూడేళ్లుగా చూస్తే అతడి ఆటలో పెద్దగా మెరుపులు కనిపించడం లేదు. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి, తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడం అతడికి అలవాటుగా మారింది' అని శ్రీకాంత్ విశ్లేషించారు. మరోవైపు రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..
అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..