ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. కోహ్లీ, రోహిత్ స్థానాలు ఇవే
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:45 PM
అత్యుత్తమ ఆటగాళ్ల ర్యాంకులను తాజాగా ఐసీసీ ప్రకటించింది. వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇటీవల వన్డేలు ఆడకపోయినా.. బ్యాటర్ల విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ టాప్-5లో కొనసాగుతున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: అత్యుత్తమ ఆటగాళ్ల ర్యాంకులను తాజాగా ఐసీసీ ప్రకటించింది. వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇటీవల వన్డేలు ఆడకపోయినా.. బ్యాటర్ల విభాగంలో విరాట్ కోహ్లీ (2), రోహిత్ శర్మ (4), శుభ్‌మన్ గిల్ (5) టాప్-5లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను గెలిపించిన బంగ్లా సారథి మెహెదీ హాసన్ మిరాజ్ బౌలర్ల లిస్ట్‌లో తొమ్మిది స్థానాలను ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరాడు.
బౌలర్ల జాబితాలో భారత్ నుంచి కుల్‌దీప్ యాదవ్ ఒక్కడే 8వ స్థానంతో టాప్-10లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో మిరాజ్ రెండు స్థానాలు పైకొచ్చి రెండో ర్యాంకులో నిలిచాడు. ఇక్కడ టాప్-10లో టీమిండియా నుంచి అక్షర్ పటేల్ పదో ర్యాంకుతో కొనసాగుతున్నాడు. జట్ల పరంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వన్డే, టీ20 ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఇక.. టీ20 బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకును మెరుగుపర్చుకుని టాప్-5లోకి దూసుకొచ్చాడు. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(753), వరుణ్ చక్రవర్తి(740) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ జాబితాలో ఎలాంటి మార్పులూ లేవు. భారత యువ హిట్టర్లు అభిషేక్ శర్మ(875), ఇషాన్ కిషన్ (871) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యవే తొలి రెండు స్థానాలు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్2026: రోహిత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..
బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!