Share News

యశ్వీర్‌ ఆల్‌రౌండ్‌ షో

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:45 AM

చండీగఢ్‌ వేదికగా జరుగుతున్న కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ క్రికెటర్‌ యశ్వీర్‌ గౌడ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు.

యశ్వీర్‌ ఆల్‌రౌండ్‌ షో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): చండీగఢ్‌ వేదికగా జరుగుతున్న కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ క్రికెటర్‌ యశ్వీర్‌ గౌడ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆటకు రెండో రోజైన శుక్రవారం చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత యశ్వీర్‌ మూడు వికెట్లు (3/66) తీశాడు. తర్వాత అజేయ శతకంతో (102 నాటౌట్‌) చెలరేగాడు.


దీంతో రెండోరోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 168 రన్స్‌ చేసింది. క్రీజులో యశ్వీర్‌తో పాటు షేక్‌ రోషన్‌ (53) ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో చండీగఢ్‌ 201, హైదరాబాద్‌ 332 రన్స్‌ చేశాయి.


ఇవి కూడా చదవండి:

అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్

Updated Date - Nov 28 , 2026 | 12:45 AM