గెలిచినా...నిరాశే
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:27 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయంతో ముగించింది. గురువారం ఒడిశాతో జరిగిన...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
సూపర్‌లీగ్ రేసులో హైదరాబాద్ విఫలం
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయంతో ముగించింది. గురువారం ఒడిశాతో జరిగిన ఎలీట్ గ్రూప్ ‘డి’ చివరి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే కేవలం 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ సూపర్ లీగ్ దశలో అడుగుపెట్టలేకపోయింది. ఆయా గ్రూపుల్లో టాప్-2 జట్లకు మాత్ర మే అర్హత ఉంటుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఒడిశా 20 ఓవర్లలో 206/8 స్కోరు సాధించింది. ఆదిత్య రౌత్ (95) సెంచరీ కోల్పోగా, గౌరవ్ (40), స్వస్తిక్ (34) ఫర్వాలేదనిపించారు. అజయ్ దేవ్‌కు మూడు, రక్షణ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 207/5 స్కోరు చేసి గెలిచింది. హిమతేజ (81), అమన్ రావు (31), అభిరాత్ (30) రాణించారు. కాగా ఇదే టోర్నీ లోని మరో మ్యాచ్‌లో ఒడిశాపై ఆంధ్ర జట్టు విజయం సాధించిం ది. ఈ గెలుపుతో ఆంధ్ర 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 24 పాయింట్లు సాధించి సూపర్‌లీగ్‌కు అర్హత దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి...
కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు
Read Latest AP News And Telugu News