Share News

వన్డేల్లో ట్రిపుల్‌ బాదేస్తాడు..

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:31 AM

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర ఆటతీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ క్రిస్‌ గేల్‌ అన్నాడు...

వన్డేల్లో ట్రిపుల్‌ బాదేస్తాడు..

వైభవ్‌ ఆటపై గేల్‌

న్యూఢిల్లీ: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర ఆటతీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ క్రిస్‌ గేల్‌ అన్నాడు. ‘ఆ రోజు నా ఫోన్‌ అదేపనిగా మోగింది. ఆ తర్వాత వైభవ్‌ 28 సిక్సర్లతో డబుల్‌ సెంచరీ సాధించాడని విన్నాను. దీంతో అది టీ20 మ్యాచా? అని అడిగితే..కాదు, వన్డే అని అనడంతో షాక్‌ అయ్యా. అతను ఇలాగే ఆడితే ఈ ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించడం కూడా ఎంతో దూరంలో లేదనిపిస్తోంది’ అని క్రిస్‌ పేర్కొన్నాడు. కాగా వైభవ్‌ను కొందరు బేబీ బాస్‌ అని పిలుస్తున్నారని, ఆ నిక్‌నేమ్‌ అతనికి ఏ మాత్రం సరిపోదని గేల్‌ అన్నాడు. రోహిత్‌ హిట్‌మ్యాన్‌, డివిల్లీర్‌ ‘360‘లా వైభవ్‌ కూడా పెద్ద పేరు సంపాదించాలని గేల్‌ ఆకాంక్షించాడు.

ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 05:31 AM