Share News

స్కాట్లాండ్‌ జట్టులో చేరిన బాబర్ ఆజం క్లోజ్ ఫ్రెండ్

ABN , Publish Date - May 09 , 2026 | 05:33 PM

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అజహర్‌ అలీ స్కాట్లాండ్‌ క్రికెట్‌ జట్టులో చేరాడు. త్వరలో జరిగే ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 టోర్నీ కోసం ఆ జట్టు బ్యాక్‌రూమ్‌ స్టాఫ్‌ కన్సల్టెంట్‌గా భాగమయ్యాడు.

స్కాట్లాండ్‌ జట్టులో చేరిన బాబర్ ఆజం క్లోజ్ ఫ్రెండ్
Former Pakistan captain Azhar Ali

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్లలో ఒకరైన బాబర్ ఆజాంకు అత్యంత సన్నిహితుడైన అజహర్ అలీ స్కాట్లాండ్ క్రికెట్ జట్టులో చేరాడు. త్వరలో నేపాల్‌లో జరిగే ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 టోర్నీ కోసం ఆ జట్టు బ్యాక్‌రూమ్‌ స్టాఫ్‌ కన్సల్టెంట్‌గా చేరాడు. ఈ టోర్నీలో స్కాట్లాండ్‌ , నేపాల్‌తో పాటు అమెరికా పాల్గొంటుంది. ప్రస్తుతం క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 పట్టికలో రెండవ స్థానంలో ఉన్న స్కాట్లాండ్, వచ్చే ఏడాది జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ గ్లోబల్ క్వాలిఫైయర్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు జట్టులో కీలక మార్పులు చేస్తుంది


ఇక అజహర్ అలీ విషయానికి వస్తే.. ఇతడు పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 2010-22 మధ్యలో పాక్‌ తరఫున కీలక బ్యాటర్‌గా ఉన్న అలీ.. రిటైర్మెంట్‌ అనంతరం పాక్‌ జాతీయ జట్టు సెలెక్టర్‌గా పని చేశాడు. అతడి క్రికెట్ కెరీర్‌లో 97 టెస్టులు, 53 వన్డేలు ఆడి.. దాదాపు 9,000 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్‌ సెంచరీ సహా 21 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత పాక్‌ స్టార్‌ ప్లేయర్ బాబర్‌ ఆజంతో అలీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2016లో వెస్టిండీస్‌పై బాబర్‌ వరుసగా మూడు వన్డే సెంచరీలు సాధించిన సమయంలో అలీ జట్టు పాక్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన పాక్‌ జట్టులో వీరిద్దరు కీలక సభ్యులు.


సీడబ్ల్యూసీఎల్- 2 కోసం స్కాట్లాండ్ జట్టు:

రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ కర్రీ, జాస్పర్ డేవిడ్సన్, ఆలివర్ డేవిడ్సన్, మైఖేల్ ఇంగ్లీష్, ఓవెన్ గౌల్డ్, జాక్ జార్విస్, ఓలీ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్ మరియు మార్క్ వాట్.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

Updated Date - May 09 , 2026 | 06:36 PM