పట్టుబిగించిన ఆస్ట్రేలియా
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:07 AM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ఇన్‌గ్లిస్ (102) శతకంతో రాణించడంతో...
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ఇన్‌గ్లిస్ (102) శతకంతో రాణించడంతో.. ఆటకు మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 330/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 429 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు 329కు 100 రన్స్ ఆధిక్యాన్ని నమోదు చేసింది. హార్మర్ నాలుగు, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. కాగా, సెంచరీతో ఇన్‌గ్లిస్ ఆస్ట్రేలియా తరఫున అరుదైన ఘనతను అందుకొన్నాడు. 3 ఫార్మాట్లతోనూ రెండేసి శతకాలు బాదిన ఏకైక ఆసీస్ ప్లేయర్‌గా నిలిచాడు. అనంతరం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 140/4 స్కోరు చేసింది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు