Share News

ఆస్ట్రేలియాకు ఆధిక్యం

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:27 AM

దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు మూడో రోజు ఆఖరికి 33/0 స్కోరు చేసింది.

ఆస్ట్రేలియాకు ఆధిక్యం
Australia vs South Africa first Test

  • దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌

డర్బన్‌: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు మూడో రోజు ఆఖరికి 33/0 స్కోరు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 106 రన్స్‌తో కలిపి కంగారూలు మొత్తం 139 పరుగుల ఆధిక్యంలో నిలిచారు. అంతకుముందు.. 27/1 స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 284 పరుగులకు ఆలౌటైంది. కంగారూలు తొలి ఇన్నింగ్స్‌లో 390 రన్స్‌ చేశారు.


కోహ్లీని దాటిన రెన్‌షా: ఆస్ట్రేలియా బ్యాటర్‌ మ్యాట్‌ రెన్‌షా విరాట్‌ కోహ్లీ రికార్డును అధిగమించాడు. ఈ క్రమంలో అతడు లోయరార్డర్‌, టెయిలెండర్లు (8 నుంచి 11వ నెంబరు బ్యాటర్లు) జతగా ఒక టెస్ట్‌ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక (174) పరుగులు చేసిన బ్యాటరయ్యాడు.

స్మిత్‌..ఒకే ఒక్కడు: టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక క్యాచులు (221) పట్టిన ఫీల్డర్‌గా స్టీవ్‌ స్మిత్‌ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ (220) రికార్డును స్మిత్‌ అధిగమించాడు.


ఇవి కూడా చదవండి:

యునిసెఫ్‌ ఇండియా సలహాదారుగా మంధాన
భారత్‌ ‘ఎ’కు ఓదార్పు విజయం

Updated Date - Oct 12 , 2026 | 02:27 AM