Share News

భారత్‌ ‘ఎ’కు ఓదార్పు విజయం

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:21 AM

ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మూడు అనధికార వన్డేల సిరీ్‌సను భారత్‌ ‘ఎ’ ఓదార్పు విజయంతో ముగించింది. నామమాత్రమైన ఈ మూడో మ్యాచ్‌లో భారత్‌ 49 పరుగుల తేడాతో నెగ్గింది.

భారత్‌ ‘ఎ’కు ఓదార్పు విజయం
India A vs Australia A 3rd ODI

  • జూ2-1తో ఆసీస్‌ ‘ఎ’దే సిరీస్‌

  • జూమూడో అనధికార వన్డే

పుదుచ్చేరి: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మూడు అనధికార వన్డేల సిరీ్‌సను భారత్‌ ‘ఎ’ ఓదార్పు విజయంతో ముగించింది. నామమాత్రమైన ఈ మూడో మ్యాచ్‌లో భారత్‌ 49 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌ ‘ఎ’ 2-1తో సిరీ్‌సను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఈ వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘ఎ’ 47.3 ఓవర్లలో 275 పరుగులు చేసింది. షెడ్గే (66), ప్రియాన్ష్‌ ఆర్య (49) సత్తా చాటారు.


ఇక.. విప్రజ్‌ (40), ప్రభ్‌సిమ్రన్‌ (39), కెప్టెన్‌ రుతురాజ్‌ (33) ఆకట్టుకున్నారు. డ్వార్షుస్‌, సదర్లాండ్‌లకు మూడేసి, స్కాట్‌కు రెండు వికెట్లు లభించాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ ‘ఎ’ 46.2 ఓవర్లలో 226 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌ (56), మెక్‌స్వీనే (39), లచ్లాన్‌ షా (31), నిఖిల్‌ చౌదరి (29) మాత్రమే రాణించారు. గుర్జ్‌పనీత్‌కు మూడు.. యష్‌ ఠాకూర్‌, నిషాంత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా విప్రజ్‌ నిగమ్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా మెక్‌స్వీనే నిలిచారు.


ఇవి కూడా చదవండి:

యునిసెఫ్‌ ఇండియా సలహాదారుగా మంధాన
ఉదయ్‌వీర్‌కు స్వర్ణం

Updated Date - Oct 12 , 2026 | 02:21 AM