కళ్లన్నీ ఆర్యవీర్‌పైనే..
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:41 AM
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌ను మనోళ్లు ఎదుర్కోనున్నారు. యూఏఈతో చావో రేవో పోరులో...
ఉ.10.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
నేడు అఫ్ఘానిస్థాన్‌తో భారత్ సెమీస్
అండర్-19 ఆసియా కప్
అల్ అమీరత్ (ఒమన్): అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌ను మనోళ్లు ఎదుర్కోనున్నారు. యూఏఈతో చావో రేవో పోరులో అద్భుత శతకం (160)తో చెలరేగిన ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్‌పైనే అందరి దృష్టి నిలిచింది. టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ ఆసియా కప్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు (252) చేసిన బ్యాటర్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో సొహైల్ ఖాన్ సారథ్యంలోని అఫ్ఘానిస్థాన్‌పైనా అతడు అదే జోరు కొనసాగిస్తాడని భావిస్తున్నారు. ఆర్యవీర్‌తోపాటు అర్జున్ రాజ్‌పుత్ కూడా తనవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అర్జున్ 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మీడియం పేసర్ ఇషాన్ సూద్ (ఎనిమిది వికెట్లు), ఎడమచేతి వాటం స్పిన్నర్ మనాల్ చౌహాన్ (ఐదు వికెట్లు) బౌలింగ్ విభాగం బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. అఫ్ఘాన్‌పైనా వారిద్దరూ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు ఫైసల్ రహీమీ, సుభాన్‌పైనే అఫ్ఘాన్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఇక, బౌలింగ్‌లో ఆ జట్టు ఆశలన్నీ నూర్ అలీ (13 వికెట్లు)పైనే ఉన్నాయి.
పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ ఢీ: గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ఢీకొంటాయి. టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు అజేయంగా నిలిచిన పాకిస్థాన్ గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. అదే ఉత్సాహంతో సెమీఫైనల్‌నూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. ఇక గ్రూపు దశలో ఒక మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News