Share News

వివాహం చేసుకున్న మహిళా స్టార్ క్రికెటర్లు..

ABN , Publish Date - Apr 07 , 2026 | 09:29 AM

ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అమీ జోన్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి పీపా క్లియరీని జోన్స్ పెళ్లి చేసుకుంది.

వివాహం చేసుకున్న మహిళా స్టార్ క్రికెటర్లు..
Amy Jones marriage

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ పీపా క్లియరీని జోన్స్ పెళ్లి చేసుకున్నారు. 2022 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. గ‌తేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 4న జోన్స్ , క్లియరీల వివాహం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీ జోన్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది.


అమీ జోన్స్, క్లియరీల వివాహ వేడ‌క‌ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరగ్గా.. ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. కాగా మ‌హిళ‌ల బిగ్ బాష్ లీగ్‌-2023లో సంద‌ర్భంగా జోన్స్‌-పీపాకు ప‌రిచయం ఏర్పడింది. వీరిద్దరూ పెర్త్ స్కార్చర్స్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం హహిస్తున్నారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుతం అమీ జోన్స్ ఇంగ్లండ్ జ‌ట్టులో కీల‌క స‌భ్యురాలిగా కొన‌సాగుతోంది. ఇప్పటి వరకు ఆమె100కు పైగా వన్డేలు ఆడి, 32.82 సగటుతో 2,659 పరుగులు సాధించింది.


మరోవైపు ఇటీవ‌ల మ‌హిళ‌ల క్రికెట్‌లో సేమ్ జేండ‌ర్ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. వీరికంటే ముందు న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌- సహచరి లియా, ఇంగ్లండ్ స్టార్‌ ప్లేయ‌ర్లు స్కివ‌ర్-కేథ‌రిన్ బ్రంట్‌, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్- కాప్‌, డానియెల్‌ వ్యాట్‌- జార్జీ హోడ్జ్ జంట‌లు పెళ్లి చేసుకుని అంద‌రిని ఆశ్చర్యానికి గురి చేశారు.


ఇవి కూడా చదవండి:

ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫైనల్స్‌లో ప్రీతి, ప్రియ, అరుంధతి

Updated Date - Apr 07 , 2026 | 09:29 AM