ఫైనల్స్‌లో ప్రీతి, ప్రియ, అరుంధతి
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:58 AM
భారత మహిళా బాక్సర్లు ప్రీతీ పవార్ (54 కిలోలు), ప్రియ (60 కిలోలు), అరుంధతి (70 కిలోలు) ఆసియా చాంపియన్‌షి్‌ప్స ఫైనల్స్‌కు...
నిఖత్, లవ్లీనా పరాజయం
ఆసియా బాక్సింగ్
ఉలాన్‌బాటర్ (మంగోలియా): భారత మహిళా బాక్సర్లు ప్రీతీ పవార్ (54 కిలోలు), ప్రియ (60 కిలోలు), అరుంధతి (70 కిలోలు) ఆసియా చాంపియన్‌షి్‌ప్స ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పూజారాణి (80 కిలోలు), అంకుషిత (65 కిలోలు) బోరో కాంస్య పతకాలు గెలుపొందారు. సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ప్రీతి 5-0తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎజీ ఇమ్ (కొరియా)పై, ప్రియ 5-0తో స్థానిక బాక్సర్ నమూన్ మోంఖోర్‌పై, అరుంధతి 4-1తో ఒయిషా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచారు.
నిఖత్‌కు నిరాశ: తెలుగమ్మాయి నిఖత్ జరీన్‌కు సెమీఫైనల్లో చుక్కెదురైంది. 51 కి. విభాగంలో చైనా బాక్సర్, ఒలింపిక్ పతక విజేత ఉ యు 5-0తో నిఖత్‌కు షాకిచ్చింది. 75 కిలోల సెమీస్‌లో లవ్లీనా బోర్గాహైన్ 0-5తో అజీజా జొకిరోవా (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమి చవిచూసింది. అంకుషిత 0-3తో నీన్ చిన్ చెన్ (తైపీ) చేతిలో, పూజారాణి 0-5తో నదెజ్దా ర్యాబెట్స్ (కజకిస్థాన్) చేతిలో పరాజయం పాలై కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!