అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్
ABN , Publish Date - Jun 28 , 2026 | 08:36 PM
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తనకు చివరిదని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తనకు చివరిదని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయం గురించి మాట్లాడిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. కాగా ఇంగ్లండ్ తరఫున స్టోక్స్ 122 టెస్టుల్లో 7228 పరుగులు, 246 వికెట్లు పడగొట్టాడు. 114 వన్డేలు ఆడి 3,463 పరుగులు, 74 వికెట్లు, 43 టీ20ల్లో 585 పరుగులు, 26 వికెట్లు పడగొట్టాడు.
నైట్‌క్లబ్ వివాదం తర్వాత..
ఇటీవల కాలంలో ఇంగ్లండ్ ప్లేయర్లు వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన అంశం చర్చనీయాంశమైంది. రెండో టెస్టుకు వీరిద్దరిపై వేటు కూడా పడింది. విచారణ చేపట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. క్లీన్‌చీట్ ఇచ్చింది. దీంతో మూడో టెస్టుకు స్టోక్స్ అందుబాటులోకి వచ్చాడు. అయితే గతంలో కూడా వీరిపై నైట్‌క్లబ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా స్టోక్స్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?
ప్రపంచ రోయింగ్ కప్: భారత్‌కు స్వర్ణం