Share News

Usman Khawaja: తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని ఎమోషనలైన ఆస్ట్రేలియా క్రికెటర్

ABN , Publish Date - Jan 04 , 2026 | 08:05 PM

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్టే.. అతనకు చివరి మ్యాచ్. అయితే ఆ మ్యాచ్ ప్రారంభానకిి ముందు తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనలయ్యాడు.

Usman Khawaja: తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని ఎమోషనలైన ఆస్ట్రేలియా క్రికెటర్
Usman Khawaja

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో సిడ్నీలో జరుగుతోన్న చివరి టెస్టే అతడి కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుంది. ఈ ప్రారంభానికి మ్యాచ్‌కు ముందు ఖవాజా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడాడు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు తారిఖ్, ఫోజియా పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ, తన క్రికెట్ ప్రస్థానం ప్రారంభం రోజుల్లో వారు చేసి త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఖవాజా పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జన్మించాడు. అతడి చిన్నతనంలోనే కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. ఈ క్రమంలో2011 జరిగిన యాషెస్(Ashes series) సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అంతేకాక ఆసీస్ తరఫున ఆడిన తొలి ముస్లిం వ్యక్తి కూడా ఖవాజానే కావడం విశేషం.


ఖవాజా(Usman Khawaja) ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాకు మంచి భవిష్యత్తు, అవకాశాలను అందించడానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేసి ఆస్ట్రేలియాకు వచ్చారు. మేము పాకిస్థాన్‌లో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపాం. మాకు అక్కడ అందమైన భవనం ఉంది. అమ్మ విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. అయితే ఆస్ట్రేలియాలో మాకు ఇంకా మంచి జీవితాన్ని అందించడానికి నాన్న వాటన్నింటినీ వదిలేశారు. ఆస్ట్రేలియాకు వస్తున్నప్పుడు మా అమ్మ చాలా బాధపడినట్లు నాకు గుర్తుంది.


నేను చిన్నతనంలో అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు అర్థమైంది. ఆమె జీవితం అంతా తలకిందులైంది. ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులు(family struggles) పడ్డాం. కరెన్సీ మార్పిడి కష్టంగా ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు నాన్ను ఉద్యోగం లేదు. చాలా కాలం కొత్త ఉద్యోగం దొరకలేదు కాబట్టి మా కోసం వారు చేసిన త్యాగాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నాను' అంటూ ఖవాజా(Usman Khawaja) ఎమోషనల్ అయ్యాడు.


ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 04 , 2026 | 08:05 PM