Share News

వ్రింద పోరాటం వృథా

ABN , Publish Date - Sep 18 , 2026 | 02:34 AM

మూడో అనధికార టీ20లో ఆస్ట్రేలియా-ఎ 168/5 స్కోరు చేసి భారత్‌-ఎను 161 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వ్రింద దినేష్‌ 69 పరుగులతో రాణించినా భారత్‌-ఎకు 7 పరుగుల ఓటమి తప్పలేదు.

వ్రింద పోరాటం వృథా
Australia A vs India A women cricket

  • మూడో అనధికార టీ20లోనూ భారత్‌-ఎ ఓటమి

  • 8 3-0తో ఆసీస్-ఎ గెలుపు

న్యూ చండీగఢ్‌: ఓపెనర్‌ వ్రింద దినేష్‌ (69) అర్ధ శతకంతో పోరాడినా.. మిడిలార్డర్‌ వైఫల్యంతో భారత్‌-ఎకు వైట్‌వాష్‌ తప్పలేదు. గురువారం జరిగిన మూడో, ఆఖరి అనధికార టీ20లో భారత్‌ 7 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌సను పర్యాటక ఆసీ్‌స-ఎ 3-0తో సొంతం చేసుకొంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఆసీస్‌ 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో భారత్‌ 19.5 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు వ్రింద, తేజల్‌ (42) తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. కానీ, కెప్టెన్‌ అనుష్క శర్మ (11)తోపాటు మిడిల్‌ బ్యాటర్లు మిన్నూ మణి (3), నిక్కీ ప్రసాద్‌ (0) విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.


ఈ వార్తలనూ చదవండి:

అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా

అభిషేక్‌ విధ్వంసం

Updated Date - Sep 18 , 2026 | 02:34 AM