ఆసియా క్రీడలు: సత్తా చాటిన గుల్వీర్ సింగ్.. భారత్‌కు రజతం
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:37 PM
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల ఫైనల్లో 28:29.38 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల ఫైనల్లో 28:29.38 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ఆసియా క్రీడల్లో గుల్వీర్ ఖాతాలో రెండో పతకం చేరింది. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బాలెవ్ 28:27.51 సెకన్లలో రేసు పూర్తి స్వర్ణ పతకం సాధించగా.. అదే దేశానికి చెందిన ఆల్బర్ట్ కిప్టో 28:34.18 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నాడు.
కాంస్యం నుంచి రజతానికి..
2022లో జరిగిన ఆసియా క్రీడల్లో గుల్వీర్ 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. నాలుగేళ్ల తర్వాత అదే విభాగంలో తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని రజతం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న గుల్వీర్‌కు ఇది మరో కీలక పతకంగా నిలిచింది. 2026 కామన్వెల్త్ క్రీడల్లోనూ గుల్వీర్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్య పతకం సాధించాడు. దీంతో ఈ ఏడాది ప్రధాన బహుళ క్రీడా ఈవెంట్లలో అతడి పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: నేపాల్ చేతిలో అఫ్గానిస్థాన్ చిత్తు.. క్వార్టర్స్ బెర్తుపై ఉత్కంఠ
ఆసియా క్రీడలు: తమిళనాడు అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా