సిరాజ్ జెర్సీ ధరించిన అభిషేక్.. ఎందుకంటే...
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:38 AM
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(బుధవారం) అహ్మదాబాద్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma).. తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జెర్సీ మార్చినా అభిషేక్ శర్మకు మాత్రం కలిసి రాలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అభిషేక్ శర్మ సిరాజ్ జెర్సీని ఎందుకు ధరించాడనే సందేహాలు అందరిలో వ్యక్తమయ్యాయి.
అభిషేక్ శర్మ.. సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగడంపై భిన్న వాదానలు వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ.. తన జెర్సీని హోటల్ గదిలో మర్చిపోయాడని ఈ మ్యాచ్‌కు కామెంటేటర్లుగా వ్యవహరించిన నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ తమ కామెంటరీలో వెల్లడించారు. అయితే అభిషేక్ శర్మ జెర్సీ తెచ్చుకున్నా.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి తీసుకురాలేకపోయారని, దాంతోనే సిరాజ్ జెర్సీ(Mohammed Siraj jersey)తో బరిలోకి దిగాడని మైదాన వర్గాల సమాచారం. బ్యాటింగ్ సమయంలో అంటే ఆలస్యమైంది.. ఫీల్డింగ్ సమయంలోనూ అభిషేక్ శర్మ.. సిరాజ్ జెర్సీలోనే కనిపించాడు. జెర్సీ అందుబాటులో లేకపోవడంతోనే బెంచ్ ప్లేయర్ అయిన అయిన సిరాజ్ జెర్సీ నెంబర్ 73 ధరించి అభిషేక్ శర్మ బరిలోకి దిగినట్లు సమాచారం.
అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC jersey rules) నిబంధనల ప్రకారం ఆటగాడు తన సొంత నంబర్ ఉన్న జెర్సీతోనే మ్యాచ్‌లోకి దిగాలి. అయితే, ఏదైనా అత్యవసర సందర్భాల్లో ఆటగాళ్లు వేరే ఆటగాడి జెర్సీని ధరించి బరిలోకి దిగుతుంటారు. గతంలో కూడా చాలా మంది ఆటగాళ్లు ఇలా తమ సహచర ఆటగాళ్ల జెర్సీలతో బరిలోకి దిగారు. తాజాగా జెర్సీ మార్చినా అభిషేక్ శర్మకు మాత్రం కలిసి రాలేదు. సూపర్-8 మ్యాచులకు కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని క్రికెట్ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..