Share News

మ్యాచ్‌కు ముందు అంట్లు తోమాల్సి వచ్చింది

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:38 AM

పాకిస్థాన్‌ హాకీ జట్టు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. హాకీ ప్రొ లీగ్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్‌ ఆటగాళ్లు.. అక్కడ తమకు కనీస సౌకర్యాలు...

మ్యాచ్‌కు ముందు అంట్లు తోమాల్సి వచ్చింది

పాక్‌ హాకీ కెప్టెన్‌ షకీల్‌ ఆవేదన

కరాచీ: పాకిస్థాన్‌ హాకీ జట్టు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. హాకీ ప్రొ లీగ్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్‌ ఆటగాళ్లు.. అక్కడ తమకు కనీస సౌకర్యాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు పడ్డామో జట్టు కెప్టెన్‌ షకీల్‌ బట్‌ వివరించాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తేలా చేసి, కిచెన్‌లో అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు తమ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌)నే కారణమని మండిపడ్డాడు. జట్టు ఆటగాళ్లతో కలిసి బుధవారం స్వదేశం చేరిన షకీల్‌.. లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడాడు. హాకీ ప్రొ లీగ్‌కు వేదికైన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో తమ ఆటగాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించడంలో పీహెచ్‌ఎఫ్‌ విఫలమైంది. గదులు బుక్‌ చేయని కారణంగా వారంతా లగేజీతో పాటు రోడ్డు మీదే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చివరకు స్థానిక పాకిస్థానీల సహాయంతో ఆటగాళ్లు అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌ తరహా అద్దె భవనంలో బస చేశారు. దాంతో ఆటగాళ్లే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే పాక్‌ హాకీ సమాఖ్యకు ఆ దేశాధ్యక్షుడు షాబాజ్‌ షరీఫ్‌ చీఫ్‌ పాట్రన్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ..

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

Updated Date - Feb 19 , 2026 | 03:38 AM