Share News

149 ఏళ్ల పరంపరకు బ్రేక్‌!

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:12 AM

ఒంటి చేత్తో ‘బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌’ కొట్టడమనేది టెన్నిస్‌లో ఓ కళ. చాలా కొద్దిమంది ఆటగాళ్లే ఈ షాట్‌ కొట్టడంలో నేర్పరులు. 80ల్లో జాన్‌ మెకెన్రో, ఇవాన్‌ లెండిల్‌, 90వ దశకంలో పీట్‌ సంప్రాస్‌, స్టెఫాన్‌ ఎడ్‌బర్గ్‌, గుస్టావ్‌ కుర్టెన్‌, తర్వాతి కాలంలో రోజర్‌ ఫెడరర్‌, స్టాన్‌ వావ్రింకా, ప్రస్తుతం డెనిస్‌ షపోవలోవ్‌, స్టెఫానో సిట్సిపాస్‌. వీరంతా ఒంటి చేత్తో బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ సంధిస్తే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

149 ఏళ్ల పరంపరకు బ్రేక్‌!

న్యూయార్క్‌: ఒంటి చేత్తో ‘బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌’ కొట్టడమనేది టెన్నిస్‌లో ఓ కళ. చాలా కొద్దిమంది ఆటగాళ్లే ఈ షాట్‌ కొట్టడంలో నేర్పరులు. 80ల్లో జాన్‌ మెకెన్రో, ఇవాన్‌ లెండిల్‌, 90వ దశకంలో పీట్‌ సంప్రాస్‌, స్టెఫాన్‌ ఎడ్‌బర్గ్‌, గుస్టావ్‌ కుర్టెన్‌, తర్వాతి కాలంలో రోజర్‌ ఫెడరర్‌, స్టాన్‌ వావ్రింకా, ప్రస్తుతం డెనిస్‌ షపోవలోవ్‌, స్టెఫానో సిట్సిపాస్‌. వీరంతా ఒంటి చేత్తో బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ సంధిస్తే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అయితే సమకాలీన టెన్నిస్‌లో ఈ షాట్‌ క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఇక యూఎస్‌ ఓపెన్‌లో సిట్సిపాస్‌ పరాజయం దరిమిలా ఈ షాట్‌కు సంబంధించి ఓ సుదీర్ఘ రికార్డు కనుమరుగైంది. ప్రీక్వార్టర్‌ ఫైనల్లో బెన్‌ షెల్టన్‌..సిట్సిపాస్‌పై గెలిచాడు. దీంతో 1877లో వింబుల్డన్‌ మొదలైనప్పటి నుంచి ప్రతిఏటా ఏదో ఒక గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్‌కు బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ ఆడగల ఆటగాడు కనీసం ఒక్కరైనా చేరుతూ వచ్చారు. కానీ సిట్సిపాస్‌ నిష్క్రమించడంతో.. 149 సంవత్సరాల ఆ పరంపరకు బ్రేక్‌ పడినట్టయింది.

ఈ వార్తలనూ చదవండి

55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

Updated Date - Sep 08 , 2026 | 02:12 AM