రైల్వే ట్రాక్‌పై బాలీవుడ్ స్టైల్‌లో డ్యాన్స్.. మహిళపై నెటిజన్ల ఫైర్
ABN , Publish Date - Oct 03 , 2026 | 07:50 AM
రీల్స్ కోసం చేసే విన్యాసాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చేలా మారుతున్నాయి. బాలీవుడ్ పాటను తలపించేలా ఓ మహిళ రైల్వే ట్రాక్‌పై చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో బాలీవుడ్ తరహా రొమాంటిక్ సన్నివేశాన్ని రీ క్రియేషన్ చేసేందుకు ఓ మహిళ చేసిన ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. ఆగి ఉన్న రైలింజన్ ముందు ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్ చేసే ముందు ఆమె చీర కొంగును రైలు ఇంజిన్‌కు కట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైక్స్.. వ్యూస్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో రీల్స్ చేయడం సరికాదని చెబుతున్నారు.
మరికొంతమంది ఈ ఘటనపై సోషల్ మీడియా వినియోగదారులు రైల్వే అధికారులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైల్వే ట్రాక్‌లు.. రైళ్ల సమీపంలో అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించడం ప్రమాదకరమని అంటున్నారు. అంతేకాదు.. రైలు నిలిచివున్నప్పటికీ పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేమని పలువురు పేర్కొన్నారు. వైరల్ కావాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రదేశాలను ఎంచుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, ఇలాంటి ఘటనలపై అధికారులు దృష్టి సారించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ కుట్ర
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Read Latest AP News And Telangana News