ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. వెతికి పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:39 AM
ఆ వ్యక్తి భార్య తన ప్రియుడితో వెళ్లిపోయింది. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో భర్త ఆగ్రహంతో పోలీసులను ఆశ్రయించడం లేదా గొడవకు దిగడం చూస్తుంటాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆ వ్యక్తి భార్య తన ప్రియుడితో వెళ్లిపోయింది. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో భర్త ఆగ్రహంతో పోలీసులను ఆశ్రయించడం లేదా గొడవకు దిగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కథ వేరేలా ఉంది. భార్య ఆమె ప్రియుడితో కలిసి ఉన్నట్టు గుర్తించిన భర్త.. వారిద్దరికీ పెళ్లి చేసి పంపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (Viral marriage story).
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన పీఆర్డీ జవాన్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోయింది. దీంతో భర్త ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు ఆమె హర్దోయ్‌లో తన ప్రియుడితో కలిసి ఉన్నట్టు గుర్తించారు. భర్త అక్కడకు వెళ్లి వారిద్దరితో మాట్లాడాడు. వారిద్దరూ కలిసి చదువుకున్నారని, ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్నాడు (Wife runs away with lover).
కుటుంబ సభ్యుల బలవంతం మేరకు తనను వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె తన ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోందని ఆ భర్త తెలుసుకున్నాడు (Unusual love story). ఆమెకు తనతో కలిసి జీవించాలనే ఆసక్తి లేదని తెలుసుకున్న తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అమె తన ప్రియుడితోనే కలిసి జీవించడం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలోనే తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించాడు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..
భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.