భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 12 , 2026 | 09:33 AM
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెట్టడానికి ముందు డ్రాగన్ కీలక సందేశం ఇచ్చింది. భారత్‌తో ఉన్న విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని చైనా స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెట్టడానికి ముందు డ్రాగన్ కీలక సందేశం ఇచ్చింది. భారత్‌తో ఉన్న విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని చైనా స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశానికి సిద్ధమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి (BRICS Summit 2026).
మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం శనివారం సాయంత్రం 5:45 గంటలకు జరగాల్సి ఉంది. ఇది వరుసగా మూడేళ్లలో మూడో భేటీ కావడం గమనార్హం. గతంలో కజాన్, తియాంజిన్‌లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. శనివారం వరుసగా మూడో ఏడాది వీరి భేటీ జరగనుంది. 2020లో గల్వాన్ ఘర్షణలు జరిగిన ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్నారు. జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది (Xi Jinping India visit).
ద్వైపాక్షిక సంబంధాలను దీర్ఘకాలిక, వ్యూహాత్మక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లడం, పరస్పర కమ్యూనికేషన్‌ను పెంచడం, సహకారాన్ని బలోపేతం చేయడం, విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోవడం తమ లక్ష్యాలని భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ పేర్కొన్నారు (India China relations). భారత్-చైనాలు మంచి పొరుగు దేశాలుగా, ఒకరి విజయానికి మరొకరు సహకరించే భాగస్వాములుగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. సరిహద్దు సమస్యతో పాటు భారత్-చైనా వాణిజ్య సంబంధాలు కూడా మోదీ-జిన్‌పింగ్ చర్చల్లో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్
సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు