Share News

విద్యార్థి చేసిన పనికి కోహ్లీ షాక్.. అసలు ఏమైందంటే?

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:52 PM

ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో.. బయట అంతటి హుందాతనాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఒక ఘటన.. కోహ్లీలోని సంస్కారాన్ని మరోసారి బయటపెట్టింది.

విద్యార్థి చేసిన పనికి కోహ్లీ షాక్.. అసలు ఏమైందంటే?
Kohli Viral Video

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో.. బయట అంతటి హుందాతనాన్ని ప్రదర్శిస్తుంటాడు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఒక ఘటన.. కోహ్లీలోని సంస్కారాన్ని మరోసారి బయటపెట్టింది. న్యూ ఢిల్లీలోని డీపీఎస్ ఆర్కేపురంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి కోహ్లీ హాజరయ్యాడు.


అకాడమీ ప్రారంభోత్సవం అనంతరం కోహ్లీ అక్కడి విద్యార్థులను సత్కరించాడు. ఆ సమయంలో ఒక విద్యార్థి కోహ్లీపై ఉన్న గౌరవంతో ఒక్కసారిగా అతని పాదాలను తాకడానికి ప్రయత్నించాడు. దీనిని ఏమాత్రం ఊహించని కోహ్లీ.. వెంటనే అప్రమత్తమై, ఆ విద్యార్థిని ఆపి.. ప్రతిగా తాను కూడా చేతులు జోడించి నమస్కరించాడు. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి సమయాల్లో కేవలం ఆశీర్వదిస్తుంటారు. కానీ కోహ్లీ తిరిగి నమస్కరించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘గొప్ప ఆటగాడికి ఉండాల్సిన లక్షణం వినయం’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్

ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!

Updated Date - Apr 28 , 2026 | 06:21 PM