Share News

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:10 PM

గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు.

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో చూడండి..
Goa parasailing accident

గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Goa parasailing accident).


ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు గోవాలోని బీచ్‌లలో వాటర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదిస్తుంటారు. తాజాగా ఓ పర్యాటకుడు బాగా బీచ్ దగ్గర పారాసైలింగ్ చేశాడు. గాలిలో ఉండగానే పారాచ్యూట్ తాడు తెగిపోవడంతో, ఆ పర్యాటకుడు సముద్రంలో పడిపోయాడు. వీడియోలో టూరిస్ట్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కింద పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అతడు లైఫ్ జాకెట్ ధరించి ఉండడంతో ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది (Tourist parasailing video Goa).


ఈ ఘటనతో గోవాలో అడ్వెంచర్ స్పోర్ట్స్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. @anilchandela83 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు (Cable snaps mid air). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 90 లక్షల మంది వీక్షించారు. గోవాలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని కొందరు కామెంట్లు చేశారు. కాగా, ఈ ఘటనపై గోవా పర్యాటక శాఖ విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం రుజువైతే లైసెన్సు సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి..

పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 31 , 2026 | 12:24 PM