మీకు మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టమా.. ఈ వీడియో చూస్తే ఇకపై ఎప్పుడూ తాగరేమో..
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:04 PM
చాలా మంది మ్యాంగో జ్యూస్‌ను ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్న తీరు చూస్తే షాకవ్వాల్సిందే.
చాలా మంది మ్యాంగో జ్యూస్‌ను ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్న తీరు చూస్తే షాకవ్వాల్సిందే. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు మామిడి రసం తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియోలో జ్యూస్‌ను తయారు చేస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు (Viral mango juice video).
@Jimmyy__02 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో మ్యాంగో జ్యూస్‌ను తయారు చేస్తున్నారు. జ్యూస్‌ను నేల పైనే వేస్తున్నారు. అక్కడ మహిళ ఒట్టి కాళ్లతో నిలబడి పని చేస్తోంది. ఆమె నిలబడి ఉన్న ప్రదేశం బురద, మురికి నీటితో నిండినట్లుగా కనిపిస్తోంది. అదంతా జ్యూస్‌లో కలుస్తోంది. ఈ మామిడి రసం ఎక్కడ తయారవుతోంది? ఎక్కడ విక్రయించబోతున్నారు? అనే విషయంలో స్పష్టత లేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Unhygienic food preparation).
'రుచి కోసం పాకులాడే ముందు, మీకు ఇష్టమైన పానీయాన్ని ఏ పరిస్థితుల్లో తయారు చేస్తున్నారో చూడండి.. అది మిమ్మల్ని భయపెడుతుంది' అని క్యాప్షన్ పెట్టారు (Unhygienic mango juice). 'మనం జంతువుల కంటే అధ్వాన్నమైన ఆహారం తింటున్నాం' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇవన్నీ చూసినా కూడా ప్రజలు శీతల పానీయాలు తాగడం ఆపరు' అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..