అమ్మకాల ఒత్తిడిలో ఐటీ, ఆటో షేర్లు.. సూచీలకు తప్పని నష్టాలు..
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:59 PM
ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే రోజును ముగించాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలను నష్టాల బాట పట్టించింది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.1350 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.
ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే రోజును ముగించాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలను నష్టాల బాట పట్టించింది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.1350 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.58) బలహీనపడింది. ఈ ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,728)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారకుంది. ఒక దశలో 400 పాయింట్లు కోల్పోయి 76,329 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 249 పాయింట్ల నష్టంతో 76,478 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 80 పాయింట్ల నష్టంతో 23,865 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో కొచిన్ షిప్‌యార్డ్, మారుతీ సుజుకీ, సోలార్ ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కేపీఐటీ టెక్, ఎయిచర్ మోటార్స్, ఎల్‌టీఎమ్, టాటా ఎలాక్సీ, యస్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు కోల్పయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 230 పాయింట్లు ఆర్జించింది.
ఇవి కూడా చదవండి..
రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..