Share News

ఇనుప డబ్బాలో ముఖం చిక్కుకుని ఎలుగు బంటి విలవిల.. రక్షించిన సైన్యం

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:21 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆపదలో చిక్కుకున్న ఓ ఎలుగుబంటిని భారత సైన్యం రక్షించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇనుప డబ్బాలో ముఖం చిక్కుకుని ఎలుగు బంటి విలవిల.. రక్షించిన సైన్యం
Himalayan Bear Rescue

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలుగుబంటి ఆహారం కోసం వెతుకుతూ ఓ రేకు డబ్బాలో తల పెట్టింది. ఆ డబ్బా ఎలుగు బంటి ముఖానికి బిగుసుకుపోయింది. దీంతో దాన్ని తొలగించుకోలేక అది నానా అవస్థలు పడింది. ఈ విషయాన్ని గమనించిన భారత సైన్యం వెంటనే స్పందించి ఎలుగుబంటిని రక్షించే చర్యలు చేపట్టింది. జాగ్రత్తగా దాని వద్దకు చేరుకున్న సైనికులు ఎలాంటి ప్రమాదం జరగకుండా రేకు డబ్బాను తొలగించి ఎలుగుబంటికి విముక్తి కల్పించారు. అనంతరం ఎలుగుబంటి సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయింది.


సైన్యం చొరవపై ప్రశంసలు..

ఆపదలో చిక్కుకున్న వన్యప్రాణిని సైన్యం సకాలంలో గుర్తించి రక్షించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలుగుబంటిని రక్షించే సమయంలో సైనికులు వ్యవహరించిన తీరు, రేకు డబ్బాను తొలగించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోను చూసిన నెటిజన్లు సైన్యం మానవ భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తోందంటూ అభినందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..

ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!

Updated Date - Aug 10 , 2026 | 01:56 PM