Share News

నదీ తీరంలో ఎంజాయ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా వచ్చిన మొసలి! వీడియో వైరల్

ABN , Publish Date - Aug 31 , 2026 | 07:29 AM

ఒక్క క్షణం ముందు వరకు అంతా సాధారణంగానే ఉంది. నదీ తీరంలో ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి.. తనవైపు మృత్యువు దూసుకొస్తుందని అసలు ఊహించలేదు. అకస్మాత్తుగా మొసలి ఆమె వైపు రావడంతో భయంతో పరుగులు పెట్టింది.

నదీ తీరంలో ఎంజాయ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా వచ్చిన మొసలి! వీడియో వైరల్
Crocodile Attack Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సరదాగా అనిపిస్తే.. మరికొన్ని మాత్రం చూస్తేనే భయాందోళనకు గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ భయానక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. ఓ యువతి నదీ తీరానికి వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా ఆమె కాలి వద్ద కదలిక కనిపిస్తుంది. కాసేపటికే ఓ మొసలి ఆమె వైపు దూసుకొస్తుంది. ఈ దృశ్యం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది.


అయితే కొన్ని క్షణాల్లోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి.. నోరు తెరిచి ఉండటంతో యువతి ఒక్కసారిగా భయాందోళనకు గురై చేతులు, కాళ్లు విదిలిస్తూ వేగంగా ఒడ్డువైపు పరుగెత్తుతుంది. అదృష్టవశాత్తూ మొసలి ఆమెను పట్టుకోకపోవడంతో ఆమె త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ప్రదేశం, ఘటన జరిగిన తేదీ వంటి వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో.. వీడియో నిజమైనదా లేదా పాత ఘటనకు సంబంధించినదా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

సింక్ డ్రెయిన్ తరచూ బ్లాక్ అవుతోందా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

నాతో బౌలింగ్ చేయించడం ఇషాన్ భయ్యా రిస్క్ అనుకున్నాడు.. కానీ!: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Aug 31 , 2026 | 12:04 PM