కదులుతున్న రైలులో పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ..
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:37 AM
కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కదులుతున్న రైలు కోచ్‌లో పూజారి మంత్రోచ్చారణ చేస్తుండగా, పలువురు భక్తులు చుట్టూ కూర్చున్నారు.
కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కదులుతున్న రైలు కోచ్‌లో పూజారి మంత్రోచ్చారణ చేస్తుండగా, పలువురు భక్తులు చుట్టూ కూర్చున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారి రైల్వే నిబంధనలపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ (Indian Railways) అధికారికంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించింది.
రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వైరల్ వీడియోలో కనిపిస్తున్నది సాధారణ ప్రయాణికుల కోచ్ కాదు. అది ప్రత్యేకంగా అద్దెకు ఇచ్చే సలూన్ కోచ్ (Saloon Coach). ఈ కోచ్‌ను నిబంధనల ప్రకారం ఒక ప్రైవేట్ పార్టీ సుమారు రూ.3.08 లక్షలు చెల్లించి బుక్ చేసుకుంది. అందులో నిర్వహించిన పూజ పూర్తిగా అనుమతుల ప్రకారమే జరిగిందని అధికారులు స్పష్టం చేశారు (Train puja viral video).
సాధారణంగా రైల్వే ఉన్నతాధికారుల ప్రయాణాల కోసం సలూన్ కోచ్‌లను ప్రత్యేకంగా రూపొందిస్తారు (Private train coach booking). అయితే నిర్ణీత నిబంధనలు, ఛార్జీలు చెల్లించి సాధారణ పౌరులు కూడా వీటిని వ్యక్తిగత కార్యక్రమాల కోసం బుక్ చేసుకోవచ్చు. ఈ కోచ్‌లలో ప్రయాణంతో పాటు కుటుంబ సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటి ప్రత్యేక అవసరాలకు అనుమతి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జిహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..