ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జీహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jul 13 , 2026 | 07:23 AM
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే (Nitesh Rane) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమిర్ ఖాన్‌ను 'లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్'గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి (Aamir Khan third marriage).
అమీర్ ఖాన్ వ్యక్తిగత నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయని నితేష్ అభిప్రాయపడ్డారు. హిందూ సమాజం, ముఖ్యంగా యువత, ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోకూడదన్నారు. వారి సినిమాలను చూడాలా, వద్దా అనే అంశంపై ఆలోచించుకోవాలని సూచించారు. 'లవ్ జీహాద్‌కు ప్రచారకర్త ఎవరు.. ఆమిర్ ఖాన్ వారిలో ఒకరు కాదా.. అలాంటి నటుల సినిమాలను చూడాలా, వద్దా అనే దానిపై హిందూ సమాజం సమీక్షించుకోవాలి' అని నితేష్ వ్యాఖ్యానించారు (Love Jihad controversy).
అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఇద్దరితోనూ విడిపోయారు. ఇటీవల గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)ను మూడో వివాహం చేసుకున్నారు. తాజాగా నితేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్