Share News

ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. వేగంగా వెళుతున్న రైలుకు వేలాడుతూ మహిళ సాహసం..

ABN , Publish Date - Jun 07 , 2026 | 09:10 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.

ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. వేగంగా వెళుతున్న రైలుకు వేలాడుతూ మహిళ సాహసం..
train stunt viral

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Train stunt viral).


@ChapraZila అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక మహిళ రైలు తలుపు దగ్గర నిలబడి ఉంది. వేగంగా వెళుతున్న రైలు గేటు హ్యాండిల్స్‌ను పట్టుకుని వెనక్కి వెలాడుతూ మాట్లాడుతోంది. వీడియో తీస్తున్న వ్యక్తితో 'రోల్ కెమెరా యాక్షన్' అని చెబుతోంది. రీల్ కోసం ప్రాణాంతక సాహసం చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Dangerous reel).


ఆ వైరల్ వీడియోను (Viral reel video) ఇప్పటివరకు వేల మంది వీక్షించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అలాంటి వాళ్లకు ఏం జరిగినా ఫర్వాలేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ వయసు మహిళకు అలాంటి సాహసం అవసరమా', 'సోషల్ మీడియా జనాల విచక్షణను చంపేస్తోంది' అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..


భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

Updated Date - Jun 07 , 2026 | 09:10 PM