Share News

విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండకపోవచ్చు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jun 07 , 2026 | 07:46 PM

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజేయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా కొనసాగుతుందా అనే చర్చ ప్రజల్లో మొదలైందని అన్నారు.

విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండకపోవచ్చు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..
MK Stalin

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజేయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా కొనసాగుతుందా అనే చర్చ ప్రజల్లో మొదలైందని అన్నారు. తమ కూటమిలోని పార్టీల మద్దతుతోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. విజయ్ ప్రభుత్వం పనితీరు గురించి స్పందించారు (MK Stalin about Vijay TVK government).


'విజయ్ ప్రభుత్వ పనితీరును ఆరు నెలల వరకు విమర్శించకూడదని నిర్ణయించుకున్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఐదు, ఆరు నెలలు కాదు.. మూడు నెలలైనా ఈ ప్రభుత్వం నిలుస్తుందా అనే సందేహం ప్రజల్లో కనిపిస్తోంది' అని స్టాలిన్ విమర్శించారు. ఓటర్లను కలవకుండా, బూత్ ఏజెంట్లను కూడా నియమించకుండా గెలిచిన పార్టీ ఎక్కువ రోజులు ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు (DMK vs TVK).


తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని స్టాలిన్ తెలిపారు (Tamil Nadu politics). తాము అలా చేయకపోతే తమిళనాడులో బీజేపీ పాలనకు మార్గం సుగమమయ్యేదని, తమ కూటమిలోని పార్టీల మద్దతుతోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..


భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

Updated Date - Jun 07 , 2026 | 09:13 PM