కిలో బెండకాయల ధర రూ.7,200.. ఇంత రేటు ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:26 PM
మనదేశంలో బెండకాయలు చాలా తక్కువ ధరకు లభ్యమవుతాయి. కిలో మహా అయితే రూ.50 నుంచి 60 వరకు ఉంటుంది. బెండకాయలతో పులుసు, కూరలతో పాటు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే స్నాక్స్ కూడా తక్కువ ధరకే లభ్యమవుతాయి.
మనదేశంలో బెండకాయలు చాలా తక్కువ ధరకు లభ్యమవుతాయి. కిలో మహా అయితే రూ.50 నుంచి 60 వరకు ఉంటుంది. బెండకాయలతో పులుసు, కూరలతో పాటు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే స్నాక్స్ కూడా తక్కువ ధరకే లభ్యమవుతాయి. అయితే అమెరికాలో ఓ భారతీయుడు షేర్ చేసిన వీడియో చూస్తే షాకవకతప్పదు. ఎందుకంటే అమెరికాలోని ఓ స్టోర్‌లో బెండకాయ స్నాక్స్ ధర దిమ్మతిరిగేలా ఉంది (Rs 7200 per kg bhindi).
అమెరికాలో ఉంటున్న ఆశిష్ అహుజా అనే ఒక భారతీయుడు అక్కడి ఒక స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ బెండకాయ ఫ్రై ధర చూసి షాకయ్యాడు. అక్కడ బెండకాయను బాగా ఫ్రై చేసి స్నాక్‌గా అమ్ముతున్నారు. 85 గ్రాముల ఆ బెండకాయ స్నాక్ ధర ఆరున్నర డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ.600. అంటే ఒక కిలో బెండకాయ ఫ్రై కొనాలంటే మన కరెన్సీలో దాదాపు రూ.7,200 చెల్లించాలన్నమాట. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు (Okra snack US).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Bhindi viral video). ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. 'బెండకాయ కూడా ఇప్పుడు ఎన్నారై అయిపోయింది', 'బెండకాయకు ఇంత గౌరవం విదేశాల్లోనే దక్కుతుంది', 'ఇంత ధర పెడితే మన దగ్గర దాదాపు ఓ వంద కేజీల బెండీ స్నాక్స్ తయారు చేయవచ్చు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..
భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి