ఇలాంటి ఫీల్డింగ్ మీరెక్కడా చూసి ఉండరు.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:34 PM
ప్రతిరోజూ సోషల్ మీడియాలో లెక్క లేనన్ని వీడియోలు, ఫోటోలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ సోషల్ మీడియాలో లెక్క లేనన్ని వీడియోలు, ఫోటోలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. కొంతమంది తమ వైరల్ వీడియోలతో రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అవుతుంటారు. తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వీడియో చూసి ఉండరు. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందో చూద్దాం..
ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ మ్యాచ్‌ల గురించే చర్చలు నడుస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక గల్లీ గల్లీలో క్రికెట్ ఆటలతో సందడి చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ గ్రౌండ్‌లో కొంతమంది యువకుడు క్రికెట్ ఆడుతున్నారు. బౌలర్ బంతిని విసరడం, బ్యాట్స్‌మన్ ఒక అద్భుతమైన షాట్ కొట్టడం కనిపిస్తుంది. బౌండరీకి పోతుందని భావించిన ఆ బంతిని ఒక ఫీల్డర్ ఆపే ప్రయత్నం చేస్తాడు. అతను బంతి దగ్గరకు చేరుకున్నప్పటికీ దాన్ని ఆపలేకపోతాడు, కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. నిజానికి, బంతిని ఆపే ప్రయత్నంలో ఫీల్డర్ ఎదురుగా గొడ ఉందని గమనించడు.. దాంతో అతను బలంగా ఆ గోడకు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. తోటి ఫీల్డర్లు అతని వద్దకు వెళ్లి లేపి పక్కకు తీసుకువెళ్తారు.
ఈ వీడియో @ChapraZila అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘క్రికెట్ అంటే ఎంత డెడికేషన్.. కానీ ప్రాణాలు కూడా ఇంపార్టెంట్’ అని కామెంట్ చేయగా, ‘వండర్ ఫుల్ ఫీల్డర్.. జస్ట్ మిస్’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘అంకితభావం గల ఫీల్డర్‌ను మీరు బహుశా చూసి ఉండరు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి
హైటెన్షన్.. ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఆందోళనకు వైసీపీ ప్లాన్.. పోలీసుల భారీ బందోబస్తు
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న లారీ