Share News

ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. భేల్‌పూరీతో ఏం చేశాడంటే..

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:49 PM

సెలవు రోజు ఖాళీగా కూర్చోవడం ఎందుకనుకున్నాడో ఏమో.. ఓ వ్యక్తి కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. భేల్‌‌పూరీతో వినూత్న ప్రయోగం చేశాడు. ఈ వెరైటీ ఆర్ట్ చూసిన నెటిజన్లు.. వావ్ వాట్ ఏ టాలెంట్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. భేల్‌పూరీతో ఏం చేశాడంటే..
bhelpuri Art

ఇంటర్నెట్ డెస్క్: సెలవు రోజు ఖాళీగా కూర్చోవడం ఎందుకనుకున్నాడో ఏమో.. ఓ వ్యక్తి భేల్‌పూరీతో చేసిన క్రియేటివిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టీల్ పళ్లెంలో ఉన్న భేల్‌పూరీలో వేరుశెనగలు, సన్నని కారపూస ఉపయోగించి చిన్న చిన్న మనిషి బొమ్మలను తయారు చేశాడు. వేరుశెనగలతో శరీరాన్ని, కారపూసతో చేతులు, కాళ్లను అమర్చి.. ఒక్కో బొమ్మను ఒక్కో భంగిమలో రూపొందించాడు. కొన్ని బొమ్మలు చేతులు పైకెత్తి డ్యాన్స్ చేస్తున్నట్టుగా.. మరికొన్ని నిలబడి ఉన్నట్టుగా కనిపించడంతో వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సెలవు రోజున కాలక్షేపం కోసం చేసిన సృజనాత్మక ప్రయత్నం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్లం’ అంటూ కొందరు తమ జ్ఞాపకాలను పంచుకోగా.. మరికొందరు దీన్ని ‘మోడ్రన్ ఆర్ట్.. అదుర్స్’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ‘నీకు ఇంత ఖాళీ సమయం ఎక్కడి నుంచి దొరుకుతుంది?’ అంటూ నవ్వులు పూయిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా

నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్

Updated Date - Aug 17 , 2026 | 07:05 PM