Share News

ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:14 PM

ధ్రువపు ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించిన ఓ వ్యక్తికి నార్వే అధికారులు రూ.5 లక్షల జరిమానా విధించారు.

ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా
Polar Bear

ఇంటర్నెట్ డెస్క్: ధ్రువపు ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించిన ఓ వ్యక్తికి నార్వే అధికారులు రూ.5 లక్షల జరిమానా విధించారు. స్వాల్‌బార్డ్‌ ద్వీపకల్ప తీరానికి సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, తీరం వెంబడి నావను నడుపుతున్న ఓ బోట్ ఆపరేటర్‌కు ధ్రువపు ఎలుగుబంటి నిద్రిస్తూ కనిపించింది. అది మెళకువగా ఉంటే చూడాలని భావించిన అతడు బోటు సైరెన్‌ను మోగించాడు. దీంతో, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది.

ఈ విషయం అధికారులకు తెలియడంతో బోటు ఆపరేటర్‌పై 50 వేల నార్వేజియన్ క్రోనర్ల (దాదాపు రూ.5 లక్షలు) జరిమానా విధించారు. స్వాల్‌బార్డ్ పర్యావరణ చట్టాల ప్రకారం, అక్కడి ధ్రువపు ఎలుగుబంట్లను వెంటాడటం, వాటికి చికాకు కలిగించడం, అవి తమవైపు వచ్చేలా ఆకర్షించడం నేరం. టూరిస్టులు అక్కడి వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.


1972లో స్వాల్‌బార్డ్ ప్రభుత్వం ధ్రువపు ఎలుగుబంట్లను రక్షిత జంతువులుగా గుర్తించింది. వాటికి ఇబ్బంది కలిగించే వారిపై భారీ జరిమానాలు విధిస్తోంది. రెండేళ్ల క్రితం ఓ టూరిస్టు వాల్రస్ అనే జంతువుకు అతి సమీపంలోకి వెళ్లినందుకు 11,500 క్రోనర్ల జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

Updated Date - Aug 16 , 2026 | 07:33 PM