Share News

సందర్శకులకు హాయ్ చెబుతున్న కోతి పిల్ల పంచ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:52 PM

జపాన్‌‌కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. జూ సందర్శకులకు చేయి ఎత్తి హాయ్ చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సందర్శకులకు హాయ్ చెబుతున్న కోతి పిల్ల పంచ్.. వీడియో వైరల్
Viral Baby Monkey Punch Kun

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌(Japan)కు చెందిన వైరల్ కోతి పిల్ల(baby monkey) పంచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. జూ సందర్శకులకు చేయి ఎత్తి హాయ్ చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచ్-కున్ (Punch-kun) అనే కోతి పిల్ల 2025 జులైలో జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే తల్లి, పంచ్‌ను దూరం పెట్టింది. తల్లితో పాటు మిగిలిన కోతులు కూడా పంచ్‌ను దూరం పెట్టాయి. దాంతో జూ సిబ్బంది పంచ్‌పై జాలిపడి ఒక ఒరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు. ఏడు నెలల పాటు ఆ బొమ్మతో ఆడుకుంటూ.. దాన్ని పట్టుకొని నిద్రపోతూ ఉన్న పంచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచం మొత్తం ఈ బుజ్జి కోతి పిల్ల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఓవర్ నైట్‌లో ‘పంచ్’ స్టార్ అయిపోయింది.


ప్రస్తుతం పంచ్‌ను చూడటానికి జూకు జనం క్యూ కడుతున్నారు. ఈ మధ్యనే పంచ్‌ని తల్లి దగ్గరకు తీసుకుంది. దానితో పాటు మిగిలిన కోతులు కూడా పంచ్ కూన్‌తో ఆడుకోవడం మొదలు పెట్టారు. తాజాగా పంచ్ కూన్ మరోసారి వార్తల్లో నిలిచింది. జూకి వస్తున్న సందర్శకులకు అద్దం వెనుక నుంచి చేతులు పైకెత్తి హాయ్ చెబుతుంది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పంచ్ మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టుంది’ అని ఒక నెటిజన్, ‘పంచ్ కష్టాలు తీరాయి..’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2026 | 05:58 PM