మాంసం కోసం 2,700 పిల్లుల కిడ్నాప్.. 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
ABN , Publish Date - Oct 07 , 2026 | 07:39 PM
ఇటీవల వియత్నాంలో సంచలనం సృష్టించిన పిల్లుల దొంగతనం కేసులో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. హోచిమిన్ సిటీలోని వివిధ నివాస ప్రాంతాల నుంచి సుమారు 2,700 పిల్లులను దొంగిలించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వియత్నాంలో సంచలనం సృష్టించిన పిల్లుల దొంగతనం కేసులో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. హోచిమిన్ సిటీలోని వివిధ నివాస ప్రాంతాల నుంచి సుమారు 2,700 పిల్లులను దొంగిలించి, వాటిని మాంసం కోసం విక్రయించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ ముఠా ప్రధానంగా రాత్రివేళల్లో కార్యకలాపాలు సాగించేది (Vietnam cat theft).
నిందితులు చిన్న చిన్న బృందాలుగా మోటార్‌సైకిళ్లపై తిరుగుతూ నివాస ప్రాంతాల్లోని పిల్లులను పట్టుకునేవారు. వారి కార్యకలాపాలు ప్రధానంగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగేవి. ఒక్కో బృందం ఒక రాత్రిలో సుమారు 4 నుంచి 10 పిల్లులను పట్టుకునేది. పిల్లులను పట్టుకునేందుకు నిందితులు చేప ముక్కలను ఎరగా ఉపయోగించి బోనులు ఏర్పాటు చేసేవారు. పిల్లులు బోనులో చిక్కుకున్న వెంటనే వాటిని మోటార్‌సైకిళ్లపై తరలించేవారు (Ho Chi Minh City cat theft).
ఈ కేసులో 39 ఏళ్ల ల్యూ థాన్ బిన్‌ను ఈ నెట్‌వర్క్‌కు ప్రధాన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. దొంగిలించిన పిల్లులను అతడు కొనుగోలు చేసి, వాటిని మాంసం కోసం విక్రయించేవాడని పోలీసులు గుర్తించారు. నిందితులు సుమారు 2,700 పిల్లులను దొంగిలించి, విక్రయించారు. నిందితుల నుంచి పోలీసులు 50 పిల్లులు, 55 బోనులు, రెండు తూకం యంత్రాలు, రెండు వెంట్రుకలు తొలగించే యంత్రాలు, 14 సంచులు, 13 మొబైల్ ఫోన్లు, ఏడు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు (Cat meat Vietnam).
స్వాధీనం చేసుకున్న పిల్లుల్లో ఇప్పటివరకు 13 పిల్లులను వాటి యజమానులకు తిరిగి అప్పగించారు (Viral world news). వియత్నాంలో కొన్ని ప్రాంతాల్లో కుక్క, పిల్లి మాంసం తింటుంటారు. అయితే జంతువులను దొంగిలించడం మాత్రం నేరం. పిల్లులు, కుక్కలను వియత్నాం చట్టం ప్రకారం వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తారు. వియత్నాంలో కుక్క, పిల్లి మాంసం తినడం ఎప్పట్నుంచో ఉంది. అయితే ఇటీవలి కాలంలో పెంపుడు జంతువుల పెంపకం పెరగడంతో కుక్క, పిల్లి మాంసం వినియోగంపై ఆసక్తి తగ్గుతోంది.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..