మార్కెట్‌లో ఫ్యాషన్ షో.. ముల్లంగి, కొత్తిమీరతో మోడళ్ల ర్యాంప్ వాక్..
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:33 PM
ముంబైలోని కూరగాయల మార్కెట్‌లో విజన్ వోగ్ ఫ్యాషన్ వీక్ నిర్వహించారు. మోడళ్లు ముల్లంగి, కొత్తిమీర వంటి కూరగాయలను ఫ్యాషన్ యాక్సెసరీలుగా ఉపయోగిస్తూ ర్యాంప్ వాక్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని వసాయ్‌లో ఓ కూరగాయల మార్కెట్ వినూత్న ఫ్యాషన్ షోకు వేదికగా మారింది. ‘విజన్ వోగ్ ఫ్యాషన్ వీక్’ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మోడళ్లు స్టైలిష్ దుస్తులు ధరించి, చేతుల్లో ముల్లంగి, కొత్తిమీర వంటి కూరగాయలను పట్టుకుని ర్యాంప్ వాక్ చేశారు.
ఫ్యాషన్ మెంటర్, మోడల్ సాహిల్ సింగ్ ఆలోచనతో రూపొందిన ఈ కార్యక్రమం సంప్రదాయ ఫ్యాషన్ షోలకు భిన్నంగా సాగింది. ఎలాంటి ఖరీదైన సెట్లు.. ప్రత్యేక లైటింగ్ లేకుండానే రద్దీగా ఉండే మార్కెట్‌లోని ఇరుకైన సందులను ర్యాంప్‌గా మార్చేశారు. ట్రెండింగ్ పహాడీ పాట నేపథ్య సంగీతంతో మోడళ్లు తమ ఆత్మవిశ్వాసంతో కూడిన నడకతో అందరినీ ఆకట్టుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వినూత్న ప్రయోగం..
ఈ ఫ్యాషన్ షోలో మోడళ్లు తమ దుస్తులకు కూరగాయలు.. మార్కెట్‌లో లభించే నిత్యావసర వస్తువులను జోడించి ప్రత్యేకమైన లుక్‌లో కనిపించారు. ముల్లంగి, కొత్తిమీర, కాలీ ఫ్లవర్ ఇతర కూగాయలు, ఆకు కూరలను ఫ్యాషన్ యాక్సెసరీలుగా మార్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖరీదైన డిజైనర్ దుస్తులు, విలాసవంతమైన వేదికలు లేకపోయినా సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంతో ప్రత్యేకతను చాటుకోవచ్చని నిర్వాహకుడు సాహిల్ సింగ్ ఈ కార్యక్రమం ద్వారా చూపించారు.
ప్రస్తుతం ఈ ఫ్యాషన్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోడళ్ల వినూత్న ఆలోచన, ధైర్యంగా ర్యాంప్ వాక్ చేసిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కూరగాయల మార్కెట్‌ను ఫ్యాషన్ వేదికగా మార్చిన ఈ ప్రయోగంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర
బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
Read Latest AP News And Telangana News