పోలీసులకు ట్రాఫిక్ రూల్స్ వర్తించవా?.. ఓ అధికారిని నిలదీసిన సామాన్యుడు..
ABN , Publish Date - Jun 21 , 2026 | 09:18 AM
ఓ యువకుడు, పోలీస్ అధికారికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో వివాదం చెలరేగింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారని యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు.
ఉత్తర్‌ప్రదేశ్: ఓ యువకుడు, పోలీస్ అధికారికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో వివాదం చెలరేగింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారని యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండవా? అంటూ పోలీస్‌ని ప్రశ్నించాడు. రూల్స్ అనేవి సాధారణ ప్రజలకు ఒకలా, అధికారులకు మరోలా ఉండకూడదని అన్నాడు. వారి వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ యువకుడు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించాడని ఇటీవల అతనికి రూ.6వేల జరిమానా విధించారు. వాహనం నంబర్ ప్లేట్ నిబంధనలకు అనుగుణంగా లేదని రూ.5వేలు, హెల్మెట్ ధరించలేదని వెయ్యి రూపాయల జరిమానా విధించారు. దీంతో చేసేదేమీ లేక నగదును ట్రాఫిక్ పోలీసులకు చెల్లించాడు. ఆ తర్వాత యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఓ పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడాన్ని గమనించాడు. వెంటనే ఆ అధికారిని నిలదీశాడు. 'మీ హెల్మెట్ ఎక్కడ?' అంటూ ప్రశ్నించాడు. దీంతో తన హెల్మెట్ పోయిందంటూ అధికారి జవాబిచ్చారు. ఆ సమాధానంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. ట్రాఫిక్ నియమాలు అందరికీ సమానంగా వర్తించవా? అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మెుదలైంది.
తనతో ఎందుకు అమర్యాదగా ప్రవర్తిస్తున్నావంటూ యువకుడిపైకి అధికారి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వాగ్వాదాన్ని అతను వీడియో తీస్తుండటంతో ఫోన్ లాక్కునేందుకు యత్నించారు. చివరికి వివాదం సద్దుమణగడంతో పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోను అనుజ్ అగ్నిహోత్రి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ నిబంధనల నుంచి పోలీసులకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ కామెంట్ల మధ్య వివాదం నెట్టింట చర్చకు దారి తీసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇదెక్కడి పవర్.. కాలితో బైక్ నడిపి షాకిచ్చిన బాబా..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..