Share News

ఇదెక్కడి పవర్.. కాలితో బైక్ నడిపి షాకిచ్చిన బాబా..

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:47 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాబా చేసిన స్టంట్ నెటిజన్లను విస్తుపోయేలా చేస్తోంది.

ఇదెక్కడి పవర్.. కాలితో బైక్ నడిపి షాకిచ్చిన బాబా..
Stunt Baba Viral Video

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాబా చేసిన స్టంట్ నెటిజన్లను విస్తుపోయేలా చేస్తోంది. బాబా బిజీ రోడ్డుపై బైక్ నడుపుతూ చేసిన ప్రమాదకరమైన స్టంట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. వీడియో చూసిన కొందరు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు (Stunt Baba Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక బాబా రోడ్డుపై బైక్ నడుపుతున్నాడు. అయితే బైక్ హ్యాండిల్‌ను చేతులతో కాకుండా ఒక కాలితో పట్టుకున్నాడు. తన రెండు చేతులను గాల్లోకి ఎత్తి నిర్లక్ష్యంగా బైక్ నడుపుతున్నాడు. అయినప్పటికీ బైక్ బ్యాలెన్స్ కోల్పోకుండా ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు (Baba Bike Stunt Video).


రోడ్డుపై ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు ఈ స్టంట్‌ను గమనించి వీడియో తీశారు (Dangerous Bike Stunt). అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఏకంగా 47 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 1.80 లక్షల మంది ఈ వీడియోను వీక్షించి తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'ఆయన తన శక్తులను పూర్తిగా వినియోగిస్తున్నారు', 'యమరాజుతో బాబా ఆడుతున్నాడు', 'బాబా ప్రస్తుతం తపస్సులో ఉన్నారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..


ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..

Updated Date - Jun 20 , 2026 | 07:07 PM