Share News

జూదానికి బానిసైన మహిళ.. ఏకంగా 14 మందిని పెళ్లి చేసుకుని..

ABN , Publish Date - Oct 08 , 2026 | 08:16 PM

అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఓ మహిళ చేసిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. జూదానికి అలవాటు పడిన ఓ మహిళ డబ్బు సమకూర్చుకోవడానికి పలువురు పురుషులను పెళ్లి చేసుకుంది.

జూదానికి బానిసైన మహిళ.. ఏకంగా 14 మందిని పెళ్లి చేసుకుని..
Las Vegas woman married 14 men

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఓ మహిళ చేసిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. జూదానికి అలవాటు పడిన ఓ మహిళ డబ్బు సమకూర్చుకోవడానికి పలువురు పురుషులను పెళ్లి చేసుకుంది. వారి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసింది. చివరకు జైలు పాలైంది. జూదానికి బానిసైన జియాయింగ్ చెన్ అనే మహిళ ఏకంగా 14 మందిని వివాహం చేసుకుంది (Woman married 14 men).


జూదానికి బానిస అయిన చెన్ సోషల్ మీడియా ద్వారా పురుషులను పరిచయం చేసుకునేది. కొద్ది కాలంలోనే పెళ్లి ప్రతిపాదన చేసేది. పెళ్లి తర్వాత అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడికి సహాయం చేయాలని చెప్పి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకునేది. ఆ తర్వాత వారితో సంబంధాలు తెంచుకునేది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఆమె లాస్‌వేగాస్‌లోని క్యాసినోలో భారీ మొత్తంలో జూదం ఆడినట్లు బయటపడింది (Rs 3 crore gambling).


గత ఏడాది కాలంలోనే ఆమె 3 లక్షల అమెరికన్ డాలర్లకు పైగా జూదంలో కోల్పోయినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు (Las Vegas fraud). భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3 కోట్లకు పైగా ఉంటుంది. చెన్ ఒక్కో పెళ్లి ద్వారా కనీసం 20 వేల డాలర్ల వరకు సంపాదించేది. లాస్‌వేగాస్‌లో పెళ్లి ప్రక్రియ సులభంగా ఉంటుంది. దీంతో ఆమె అక్కడే పలు వివాహాలు చేసుకుంది. ఒక్కో పెళ్లి చేసుకునేటప్పుడు ఒక్కో పేరును, చిరునామాను ఉపయోగించేది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే బాధితులకు రూ.2.5 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..


సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

Updated Date - Oct 08 , 2026 | 08:28 PM